వర్షాకాలంలో పసుపు, తులసి కషాయలు తీసుకోవడం వలన రోగ నిరోధక పెరగడమే కాకుండా… గొంతు సమస్యను తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపున తులసి నీరు తీసుకోవడం వలన బరువు తగ్గడంలో సహయ పడతుంది. కడుపులో ఎసిడిటి ఉన్నవారు ప్రతి రోజూ రెండు నుంచి మూడు తులసి ఆకులను తినాలి. కొబ్బరినీళ్లు తులసి ఆకులు, నిమ్మరసం కలిపి తాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి టీ లేదా కషాయం తాగడం వలన జీర్ణ సమస్యలను తొలగిపోతాయి. అలాగే సీజనల్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది.