దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తెరుచుకోవు. బీఎస్ఈ క్యాలెండర్ ఇయర్లో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19న సెలవు ఇచ్చారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లకు వినాయక చవితి సందర్భంగా సెలవు ప్రకటించారు. అందువల్ల కమొడిటీ ట్రేడింగ్, ఫారెక్స్ వంటివి జరగవు. ఇక సోమవారం సెన్సెక్స్ 241 పాయింట్ల నష్టంతో 67597 వద్ద, నిఫ్టీ సైతం 59 పాయింట్ల నష్టంతో 20,133 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.