ప్రపంచకప్ ముందట పలువురు కీలక ఆటగాళ్లు గాయపడడం పలు జట్లను ఆందోళన కల్గిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ స్టార్ బౌలర్ సౌథీ గాయపడ్డాడు.ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో వన్డేలో కుడిచేతి బొటనవేలుకి గాయమైంది.గాయాన్నిపరిశీలించిన వైద్యులు త్వరలో శస్త్రచికిత్స చేయనున్నారు. డాక్టర్ల నివేదిక అనంతరం వన్డే ప్రపంచకప్ కు అందుబాటులో ఉండే విషయాన్నిప్రకటిస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.