ప్రముఖ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ సీఈవోగా ‘అర్జున్ మోహన్’ బాధ్యతలు చేపట్టారు. ‘మృణాల్ మోహిత్’ రాజీనామా చేశారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో ఆయన వైదొలగినట్లు సమాచారం. అర్జున్ 2020 వరకూ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా పని చేశారు. ఆ తర్వాత రోనీ స్క్రూవాలా స్థాపించిన ఎడ్ టెక్ స్టార్టప్ సీఈవోగా వెళ్లే క్రమంలో రాజీనామా చేశారు. కాగా, ఇప్పుడు మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు.