దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 315 పాయింట్ల నష్టంతో 66,484 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 90 పాయింట్లు నష్టపోయి 19,810 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, మారుతీ, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.