దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 144 పాయింట్ల లాభంతో 66,374 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 19,778 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.83 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. పవర్‌గ్రిడ్, విప్రో, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.