చాలామందికి నోటి పూత సమస్య సాధారణం. దీనికి ఇంటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్పూన్ ధనియాల పొడిని నీటిలో వేసి మరిగించి రోజుకు మూడుసార్లు తాగితే ఉపశమనం కలుగుతుంది. తేనేను నేరుగా నోటి పుండ్లపై పూయవచ్చు. యాలకుల పొడిని తేనెతో కలిపి రాసినా నోటి పూత తగ్గుతుందంటున్నారు. వెన్న, నెయ్యిని రోజుకు 4 సార్లు రాసినా నోటి పూత తగ్గుతుందంటున్నారు.