రాజ్‌కోట్‌లో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. 353 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 286 పరుగులకే ఆలౌటైంది. దీంతో చివరి వన్డేలో ఆసీస్ విజయం సాధించింది. రోహిత్ శర్మ 81, కోహ్లీ 56, శ్రేయాస్ 48, రాహుల్ 26, జడేజా 35 పరుగులు చేశారు. మ్యాక్స్ వెల్ 4, హేజిల్ వుడ్ 2, స్టార్క్, కమిన్స్, గ్రీన్, సంగ వికెట్లు తీశారు. భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.