భారత మాజీ దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, ఆయన సతీమణి రోమి దేవ్ కోర్టుకెక్కారు. జంతువులపై హింసకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టంలోని కొన్ని నిబంధనలు వాటిపై హింసను ప్రోత్సహించేవిగా ఉన్నాయని వారు ఆరోపించారు. వీధి కుక్కలను ప్రమాదకర ఛాంబర్లలో ఉంచుతున్నారని, ఏ చట్టం ప్రకారమైనా వాటి సంతతిని నిర్మూలించాలనుకోవడం తగదని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ అక్టోబరు 13న విచారణకు రానుంది.