చైనాలో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత్ శనివారం స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో థైపీ జోడిపై భారత క్రీడాకారులు రోహన్ బోపన్న, రుతుజా జోడీ 2-6, 6-3, 10-4 తేడాతో గెలిచింది. దీనితో కలిపి ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య 9కి చేరింది. మొత్తం 35 పతకాలతో భారత్ ఐదో స్థానంలో ఉంది.