అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 493 పాయింట్ల నష్టంతో 65,501 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 156 పాయింట్లు నష్టంతో 19,497 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.23 దగ్గర ప్రారంభమైంది.