టీమ్ ఇండియా క్రికెటర్ కేఎస్ భరత్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 కేడర్ ఉద్యోగం ఇచ్చింది. అలాగే విశాఖలో వెయ్యి చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు క్రికెటర్ కేఎస్ భరత్‌కు మంత్రి అమర్నాథ్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఆయా పత్రాలను అందజేశారు. క్రికెట్ అకాడమీకి స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి తెలిపారు.