దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 205 పాయింట్ల నష్టంతో 66,077 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 19,702 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.24 దగ్గర ప్రారంభమైంది. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, మారుతీ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో.. నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, HDFC బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.