వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ జట్టుకు భారీ షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ షకీబ్ ఈ నెల 19న భారత్ తో జరిగే మ్యాచ్ ఆడటం అనుమానంగా మారింది. చెన్నైలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ షకీబ్ గాయపడ్డారు. దీనిపై స్పందించిన బంగ్లా జట్టు డైరెక్టర్ ఖలీద్. షకీబ్ గాయం నుంచి కోలుకోంటున్నారని తెలిపారు. 'మ్యాచ్ కు ముందు అతడు ఆడే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. ఫిట్ గా ఉంటే ఆడిస్తాం. లేకుంటే రిస్క్ తీసుకోం' అని డైరెక్టర్ ఖలీద్ తెలిపారు.