మనుషుల పని సులభతరం చేసేందుకే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ( రోబో )లు రూపొందిందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. బ్రిటన్ లోని వెస్ట్ ససెక్స్ కాట్టెసూర్ స్కూల్ ఇదే ఫాలో అయింది. హెడ్మాస్టర్ టామ్ రోజర్సన్ తనకు సహాయంగా ప్రిన్సిపాల్ గా, హెడ్ టీచర్ గా బెయిలీ అనే AI రోబోను నియమించుకున్నారు. స్కూల్ నిర్వహణ, పాలసీల వంటి అనేక విషయాల్లో తనకు మెరుగైన సలహాలు ఇచ్చేందుకు వీలుగా ఈ రోబోను నియమించినట్లు హెడ్మాస్టర్ తెలిపారు.