టీమిండియా వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై ఘన విజయంతో భారత్ జోరు మీద ఉంది. ఇదే ఉత్సాహంతో రేపు పుణేలో బంగ్లాదేశ్ ను కూడా చిత్తు చేయాలని టీమిండియా ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇప్పటికే భారత ఆటగాళ్లు పుణేలో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. బంగ్లాను భారీ తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోవాలని అనుకుంటుంది. కెప్టెన్ రోహిత్ తో పాటు మిగతా ప్లేయర్స్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపించారు.