దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 326 పాయింట్ల లాభంతో 63,474 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 18,955 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.23 దగ్గర ప్రారంభమైంది. ఇన్ఫోసిస్, SBI, టాటా స్టీల్, విప్రో, ఎన్టీపీసీ షేర్లు లాభపడుతున్న వాటిలో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.