ఇంగ్లండ్‌తో నేడు జరిగే మ్యాచ్ గెలిస్తే భారత్ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నట్లే. ప్రస్తుతం 5 మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇవాళ మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లకు చేరుతుంది. పాయింట్ల టేబుల్లో పైనున్న నాలుగు జట్లు కాకుండా శ్రీలంక మాత్రమే గరిష్ఠంగా 12 పాయింట్లకు చేరుకోగలదు. రన్ రేట్ ప్రకారం లేదా శ్రీలంక తర్వాత ఆడనున్న మ్యాచ్‌ల ప్రకారం చూసినా భారత్ సెమీస్ బెర్తు ఖాయమైనట్లే.