ప్రపంచ కప్ టోర్నీలో గత 20 ఏళ్లుగా భారత జట్టు ఇంగ్లండ్ జట్టును ఓడించలేకపోయింది. భారత్ చివరిసారిగా 2003 ప్రపంచ కప్లో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. మూడుసార్లు ఇండియా (1983, 1999, 2003 వరల్డ్ కప్లలో) జట్టు విజయం సాధించగా, నాలుగుసార్లు ఇంగ్లండ్ (1975, 1987, 1992, 2019 సంవత్సరాల్లో) విజేతగా నిలిచింది. 2011 వరల్డ్ కప్లో మ్యాచ్ టై అయింది.