ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ఐరాసలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఐరాసలో భారత్ తీరుపై షాక్‌కు గురయ్యానని, సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. సత్యాహింసల పునాదులపై ఏర్పడిన దేశం అంతర్జాతీయ వేదికపై ఇలా స్పందిస్తుందని ఊహించలేదన్నారు. ‘కంటికి కన్ను’ భారతదేశ విధానం కాదన్న విషయం ఆమె గుర్తు చేశారు.