టాక్స్ చెల్లింపుదారులు తమ రీఫండ్లు పొందడం కోసం వాలిడేటెడ్ బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉండాలని ఐటీ శాఖ తెలిపింది. బ్యాంక్ ఖాతా లేని ట్యాక్స్ పేయర్లకు దీని గురించి ఇప్పటికే ఈమెయిల్, సందేశాలు పంపడం జరిగింది. ఐటీ వెబ్సైట్లో బ్యాంక్ అకౌంట్ను అప్డేట్ లేదా యాడ్ చేసుకోవాలని ట్వీట్ చేసింది. ఇ-ఫైలింగ్ పోర్టల్లో బ్యాంక్ ఖాతా వాలిడేషన్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని తెలిపింది.