నేడు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ తో జరుగనున్న మ్యాచ్ లో భారత్ సెమీస్ ను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం భారత్ ఖాతాలో 10 పాయింట్లున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే 12 పాయింట్లకు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పైనున్న 4 జట్లు కాకుండా శ్రీలంక మాత్రమే 12 పాయింట్లకు రాగలదు. రన్ రేట్, శ్రీలంక తర్వాత ఆడనున్న మ్యాచెస్ ఆధారంగా భారత్ సెమీస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడించాయి.