ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్ మధ్యలో వైదొలగడంపై పీవీ సింధు ఎక్స్ యాప్ అప్డేట్ ఇచ్చింది. మళ్లీ అదే స్పీడ్‌తో వస్తానని సింధు తెలిపారు. "మోకాలిలో సమస్య ఉందని స్కానింగ్‌లో తేలింది. మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించడం విశేషంగా మారింది. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు తెలిపారు. ఈ విరామం రాబోయే ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టడానికి సహాయపడుతుందని సింధూ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నాకు మద్దతను ఇస్తున్నందుకు ధన్యవాదాలు అని అభిమానులకు తెలియజేశారు.