టెస్లా, ట్విటర్ సీఈఓ ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ స్టార్ లింక్ త్వరలో భారత్‌లో అనుమతి పొందే అవకాశం ఉందని సమాచారం. ఇందుకోసం కొన్ని నెలల క్రితం టెలికాం శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. స్టార్ లింక్ ఇచ్చిన వివరణలతో ప్రభుత్వం సంతృప్తి చెందిందని కథనాలు వస్తున్నాయి. స్టార్ లింక్‌కు అనుమతి ఇస్తే, రిలయన్స్ జియో స్పేస్ ఫైబర్, ఎయిర్టెల్ వన్ వెబ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు తీవ్రమైన పోటీని ఇచ్చే అవకాశం ఉంది.