ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ సమయంలో, ప్రముఖ సోషల్ మీడియా సంస్థ 'X' (X) ప్లాట్‌ఫారమ్ సెమిటిక్ వ్యతిరేక పోస్ట్‌ల ద్వారా ఆగ్రహాన్ని కలిగిస్తోంది, వాటిలో కొన్ని కంపెనీ యజమాని ఎలోన్ మస్క్ మద్దతుతో ఉన్నాయి. మస్క్ ప్రవర్తనపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి చెందిన దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. యాపిల్ మరియు డిస్నీ వంటి సంస్థలు Xలో తమ ప్రకటనలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.