దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 93 పాయింట్ల నష్టంతో 65,701 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 19,720 దగ్గర కొనసాగుతోంది. HCL టెక్, NTPC, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, TCS, పవర్‌గ్రిడ్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, HUL, ఎల్అండ్టీ, టైటన్, ఎంఅండ్ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.