కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో కొండపై వెలసిన తిమ్మప్ప స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబడులను తీర్చుకున్నారు. కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు స్వామిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.