జేఈఈ మెయిన్స్ తొలి విడతకు దరఖాస్తు గడువును డిసెంబరు 4వ తేదీ (రాత్రి 9 గంటల) వరకు పొడిగించారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సవరించిన టైమ్ టేబుల్ ను వెల్లడించింది. గురువారం రాత్రితో గడువు ముగియగా దాన్ని డిసెంబరు 4వ తేదీ వరకు పొడిగించింది. సమర్పించిన దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే వెబ్‌సైట్‌లో డిసెంబరు 6 నుంచి 8వ తేదీ వరకు సవరించుకోవచ్చని పేర్కొంది. కాగా తొలి విడత ఆన్‌లైన్ పరీక్షలు జనవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa