ఎంతగా మనం సంపాదిస్తూ డబ్బులను దాచుకోవాలని అనుకున్నా కూడా శనీ ప్రభావం మనమీద ఉంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని పండితులు చెబుతున్నారు.. శని చెడు దృష్టి ఎవరిపై పడితే వారీ జీవితం కష్టాలతో నిండి పోతుంది.దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాదు. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే ఎంత బీద వారైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే. అయితే మనం చేసే కొన్ని రకాల పనులు శని దేవుడికి అస్సలు నచ్చవు. అందుకే శని దేవుడు విషయంలో కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతూ ఉంటారు.. శనివారం అసలు చెయ్యకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శనివారం రోజున ఎప్పుడూ కూడా ఇనుప వస్తువులను అసలు కొనకూడదు.. ఈ విధంగా చేయడం వల్ల శని దేవుడికి మీపై కోపం వస్తుంది. అలాగే శనివారం రోజు ఉప్పును కొనుగోలు చేయడం అస్సలు మంచిది కాదు. శనివారం రోజు ఉప్పును కొనుగోలు చేయడం వల్ల అప్పులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా బలహీనపడుతుంది.. అలాగే శనివారం రోజు కత్తులు, కత్తెరలను వేరే వారికి గిఫ్ట్ గా అసలు ఇవ్వకూడదు.. ఇంట్లో గొడవలు జరుగుతాయి..
అలాగే శనివారం రోజు గొడవలు పెట్టుకోవడం లేదా పెద్దలను ఆ గౌరవ పరచడం ఇలాంటివి చేయడం వల్ల శని దేవుడు ఆగ్రహిస్తాడు. చాలామందికి ఉండే అతి చెడ్డ అలవాటు నడుస్తున్నప్పుడు కాళ్ళను నేలకు ఏడుస్తూ నడవడం. అలా చేయడం వల్ల శనీశ్వరుడు వారిపై ఆగ్రహిస్తాడు. అందుకే ఇంట్లో పెద్దవారు నడిచేటప్పుడు కాళ్లు కొంచెం పైకి లేపి నడిచమని చెబుతుంటారు.. అంతేకాదు వంటగదిలో పాత్రలను శుభ్రం చేస్తే కూడా ఆయనకు కోపం వస్తుంది.. శని దేవుడు ఇలా చేసే వారికి కష్టాలను పెంచుతాడు.. అందుకే ఇలాంటివి శనివారం రోజు అసలు చెయ్యకండి.. పొరపాటున చేస్తే నష్టాలు తప్పవు..