శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు కార్తీక మాసం మూడవ సోమవారం కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.