ఇంటర్ పబ్లిక్ పరీక్షలను మార్చి 1వ తేదీ నుంచి నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాథమికంగా నిర్ణయించింది. మార్చి 20వ తేదీలోపు ప్రాక్టికల్స్, వొకేషనల్, థియరీ పరీక్షలను పూర్తి చేసేలా షేడ్యూల్ రూపొందించింది.
మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున.. పరీక్షలు త్వరగా పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.