దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 377.50 పాయింట్లు క్షీణించి 69,551.03 వద్ద, నిఫ్టీ 90.70 పాయింట్లు క్షీణించి 20,906.40 వద్ద ఉన్నాయి. BPCL, అపోలో హాస్పిటల్స్, మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, ఐషర్ మోటార్స్ లాభాల్లో, HDFC లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, SBI లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.38 వద్ద ఉంది.