దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ మరోసారి 70 వేల మార్కుని దాటింది. నిఫ్టీ కూడా 21 వేల మార్కుని దాటింది. ఈ వారంలో సెన్సెక్స్ 70 వేల మార్క్ దాటడం ఇది రెండో సారి. డాలర్‌తో పోలిస్తే రూపాయ మారకం విలువ 83.38 వద్ద కొనసాగుతోంది. అమెరికా ఫెడ్ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ సూచీలపై సానుకూల ప్రభావం చూపింది.