ఈ నెల 19న శ్రీవారి బ్రేక్ దర్శనాలను టిటిడి అధికారులు రద్దు చేశారు. ఈ నెల 23 నుంచి 2024 జనవరి 1 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.
దీంతో 19న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించండటంతో బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ కారణంగా 18వ తేదీ సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించి, తిరుమల పర్యటన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు.