నెయ్యి అందాన్ని రెట్టింపు చేయడానికీ సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది. చర్మం కాంతివంతంగా ఉండాలంటే నెయ్యి, పసుపు ప్యాక్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. స్పూను నెయ్యికి చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టించండి. 5 నిమిషాలు మర్దనా చేసి, గాఢత తక్కువున్న సబ్బుతో కడిగితే సరి. నెయ్యి చర్మానికి తేమను అందించగా, పసుపులోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి మెరుపును అందిస్తాయి.