ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూపే క్రెడిట్ కార్డు ఉందా? న్యూ ఇయర్‌ ఆఫర్.. ఇలా చేస్తే రూ.3 వేలు మీవే!

business |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 10:42 PM

 ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్, పేమెంట్స్ సర్వీస్ సంస్థ రూపే తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. కొత్త ఏడాది వేళ ఎక్స్‌క్లూజివ్ న్యూ ఇయర్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. డిసెంబర్ 30, 2023 నుంచి జనవరి 1, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ అనేది రూపే క్రెడిట్ కార్డు యూపీఐ ట్రాన్సాక్షన్లకు వర్తిస్తుంది. రూపే క్రెడిట్ కార్డు ద్వారా చేసే అన్ని ట్రాన్సాక్షన్లకు వర్తిస్తుందని రూపే కంపెనీ తెలిపింది. ఈ క్రమంలో ఈ ఆఫర్ కి ఎవరు అర్హులు, క్యాష్ బ్యాక్ ఎంత అనేది పూర్తి వివరాలను ఇప్పుడే తెలుసుకోండి.


న్యూ ఇయర్ క్యాష్ బ్యాక్ ఆఫర్..


కస్టమర్లు తప్పనిసరిగా తమ రూపే క్రెడిట్ కార్డును యూపీఐతో లింక్ చేసుకుని ఉండాలి. ఈ క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఈ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. కనీసం రూ. 7500 యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే వారికి రూ. 3 వేల వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ డబ్బులు కస్టమర్ ఖాతాలో ట్రాన్సాక్షన్ జరిగిన 30 రోజుల్లోపు జమ అవుతుంది. అయితే, ఈ ఆఫర్ ఎంపిక చేసిన కేటగిరీలకే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్, ఆభరణాలు, ఎయిర్ లైన్స్, హోటల్స్, డైనింగ్ వంటి ఎంపిక చేసిన వాటికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.


న్యూ ఇయర్ వేళ పార్టీ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్న వారికి ఇది మంచి ఆఫర్ అని చెప్పవచ్చు. ట్రావెల్ చేసే వారు, షాపింగ్ చేసే వారు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవచ్చు. రూ. 3 వేల మేర క్యాష్ బ్యాక్ పొందాలని మీరు అనుకుంటే వెంటనే మీ రూపే క్రెడిట్ కార్డును యూపీఐ యాప్ తో లింక్ చేసుకోండి. మీ క్రెడిట్ కార్డుతో జనవరి 1లోపు రూ.7500 వరకు ఖర్చు చేసి రూ. 3 వేల వరకు క్యాష్ బ్యాక్ అందుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com