భారత దేశంలో తొండం లేని వినాయకుడి ఆలయం ఆరావళి పర్వతం మీద ఉంది. 18వ శతాబ్దంలో రాజస్థాన్‌లోని జైపూర్ స్థాపన కోసం సవాయి జై సింగ్ గుజరాత్ నుంచి పండితులను ఇక్కడికి పిలిపించి ఆలయాన్ని స్థాపించారు.
వినాయకుడి ఆశీర్వాదం జైపూర్‌పై ఉండేలా గణేశుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్టించారు. ఈ ఆలయం ‘గర్ గణేష్’ పేరుతో ప్రసిద్ధి చెందింది. 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే 365 మెట్లు ఎక్కాలి.