ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 3న పాకిస్తాన్తో జరగనున్న మూడో టెస్ట్ అనంతరం టెస్టులకు వీడ్కోలు పలుకనున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. టెస్టుల్లో తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరని ప్రశ్న ఎదురైంది. దానికి వార్నర్ దక్షిణాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ పేరు చెప్పారు. తను బౌలింగ్ చేసేటప్పుడు భయపడిపోయానని వార్నర్ చెప్పుకొచ్చారు.