క్రికెట్ చరిత్రలో అత్యధిక వేగంగా బంతి విసిరిన బౌలర్గా పాకిస్తానీ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కొనసాగుతున్నారు. 'రావల్పిండి ఎక్స్ప్రెస్'గా ప్రసిద్ధి చెందిన షోయబ్ 161.3 కి.మీ వేగంతో బంతిని విసిరారు. ఇక తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా బౌలర్లు షాన్ టైట్ (161.1 కి.మీ), బ్రెట్ లీ (161.1 కి.మీ), జెఫ్ థామ్సన్ (160.6 కి.మీ), మిచెల్ స్టార్క్ 160.4 కి.మీ ఉన్నారు. టాప్ 5లో నలుగురు ఆసీస్ బౌలర్లు ఉండడం విశేషం.