ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ సామర్ధ్యం ఆధారంగా ఉద్యోగుల తొలగింపునకు కసరత్తు సాగిస్తోంది. మొత్తం ఉద్యోగుల్లో 5-7 శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుంది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియను ముగించాలని ఫ్లిప్కార్ట్ యోచిస్తోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గత ఏడాది నుంచి తాజా నియామకాలను ఫ్లిప్కార్ట్ నిలిపివేసింది.