నీరసం రాకుండా కొన్ని ఫుడ్స్ తింటే బరువు త్వరగా తగ్గుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. విటమిన్ ఎ, సి, ఇ, అలాగే జింక్, సెలీనియం లభించే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను రోజుకి 150 గ్రాములకు మించకుండా తీసుకోవాలి. వీటితో పాటు బాదం, పిస్తా, సన్ఫ్లవర్, గుమ్మడి, చియా, అవిసెగింజలను ఇవ్వండి. మైదాతో చేసిన సేమియా, బేకరీ పదార్థాలకు దూరంగా ఉంచాలి. ఉప్పు ఎక్కువ ఉండే నిల్వ పచ్చళ్లు, చిప్స్, స్వీట్లు, ఐస్క్రీమ్లు వద్దే వద్దు.