నేటికీ ఇంజినీరింగ్, టెక్నికల్ రంగాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఉంటున్నారు. ప్రభుత్వం CBSE Udaan పథకం కింద ఈ అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది.
ఈ పథకం ద్వారా వేల మంది బాలికలకు ఇంజినీరింగ్ కాలేజ్‌లలో చేరేందుకు ఉచితంగా సాయం అందిస్తారు. ఈ పథకం కింద భారతదేశంలోని 60 కేంద్రాల్లో వర్చువల్ తరగతులు నిర్వహిస్తారు. ఆసక్తిగల దరఖాస్తుదారులు అధికారిక CBSE- www.cbse.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.