మహీంద్రా అండ్ మహీంద్రా ఆధునీకరించిన కొత్త ఎక్స్‌యూవీ 700ను (Mahindra XUV700) లాంఛ్ చేసింది. దీని ధర రూ.13.99లక్షల నుంచి ప్రారంభమవుతుంది. గరిష్ఠ ధర రూ.23.99లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) ఉంది.
జనవరి 15 నుంచి బుకింగ్స్ మొదలయ్యాయి. జనవరి 25నుంచి డీలర్ల వద్ద డెమో వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎక్స్‌యూవీ700 ఐదు వేరియంట్లలో వస్తోంది. ఐదు, ఆరు, ఏడు సీట్ల ఆప్షన్లతో వస్తోంది.