ఐపీఎల్ 2024కి ముందే గుజరాత్ టైటాన్స్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై తరపున ఆడుతుండటంతో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఈ జట్టులోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ఆఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు షమీ దూరం కాగా, పాకిస్తాన్‌తో సిరీస్‌లో విలియమ్సన్ కూడా గాయపడ్డాడు. మరో వైపు వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ గాయంతో బాధపడుతున్నాడు.