టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, అతడి భార్య సౌమ్య దాస్ ఈ మేరకు కేసు వేశారు. ఒప్పంద ఉల్లంఘన జరిగిందంటూ అసత్య ఆరోపణలతో ధోనీ తమ పరువుకు భంగం కలిగించారని, నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్లు కోరారు. ఈనెల 18న దీనిపై విచారణ జరగనుంది. కాగా తనను రూ.16 కోట్లకు మోసం చేశారంటూ ఎంఎస్ ధోనీ ఇటీవలే వీరిపై చీటింగ్ కేసు పెట్టారు.