సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ బారిన పడిన విషయం తెలిసిందే. ఓ గేమింగ్ యాప్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్టుగా సైబర్ నేరగాళ్లు వీడియోను సృష్టించి నెట్టింట వదలడంతో అది వైరల్ అయ్యింది. దీనిపై సచిన్ కూడా స్పందించారు. ఇది నకిలీదని, ఇలాంటివి తమ దృష్టికి వస్తే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సచిన్ కోరారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు ఎప్ఐఆర్ నమోదుచేశారు.