టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై సినీనటుడు పోసాని కృష్ణమురళీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి పల్లం సరోజనీ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీశ్రేణులతో కలిసి బుధవారం సీఐ ఆర్.అహ్మద్ జానీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు కూచిపూడి ఝాన్సీరాణి, షేక్ నజ్మా, మాజీ కౌన్సిలర్ వేమవరపు విజయ్‌కుమార్, పసుమర్తి యలమంద, పల్లం జీవన్, ఇందు, మస్తాన్బి, కూచిపూడి జాషువా తదితరులున్నారు.