కర్నూలు జిల్లా, కోసిగి మండలంలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన సర్పంచ్ హుసేని మరియు మరో ఇద్దరు వ్యక్తులు సూరి, వినోద్ లను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.