చలికాలం ఉద్దానం కిడ్నీ రోగుల పాలిట ప్రాణసంకటంగా మారుతోంది. పొగమంచు, తీవ్ర చలిగాలులకు డయాలసిస్ బెడ్లపై ఉన్న కిడ్నీ రోగుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. చలి ప్రారంభమైన కేవలం నెల రోజుల్లో పలాస రెవిన్యూ డివిజన్‌లో పదుల సంఖ్యలో కిడ్నీ బాధితులు మృతి చెందడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. చలిపై కిడ్నీ బాధితులకు అవగాహన లేకపోవడం, దాన్ని అంచనా వేయకపోవడంతోనే మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక్క ఈ కాలంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే డయాలసిస్‌తో కిడ్నీ రోగుల మరణాల నుంచి బయటపడవచ్చని వైద్యాధికారులు అంటున్నారు.