హజ్ యాత్రికుల సమస్యలను ప్రభుత్వం చొరవ తీసుకొని పరిష్కరించాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ కోరారు. శాసనసభ సమావేశాల్లో హజ్ యాత్రికుల సమస్యలను ఆయన చర్చకు తెచ్చారు. రాష్ట్రం నుంచి ప్రతి ఏటా 3,900 మంది హజ్ హజ్ యాత్రకు వెళ్తున్నారని, వారికి తగిన సౌకర్యాలు అం దించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనం తరం తెలుగుదేశం ప్రభుత్వం కడపలో హజ్ హౌస్ నిర్మా ణానికి ప్రతిపాదించిం దని, గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు బయలుదేరే వారి సంఖ్య కూడా అధికంగా ఉందని, అందువల్ల గన్నవరంలో కూడా హజ్ హౌస్ నిర్మించాలని కోరారు. గన్నవరం నుంచి నేరుగా హజ్ యాత్రకు వెళ్లేందుకు విమానాలు లేక యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. గన్నవరం నుంచి నేరుగా హజ్ యాత్రకు వెళ్లేందుకు వీలుగా విమాన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గత ప్రభుత్వంలో హజ్ యాత్రకు ప్రకటించిన సబ్సిడీనీ ఇప్పటి వరకు చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం ఆ సబ్సిడీని జమ చేసేలా చూడాలని ముఖ్య మంత్రిని ఆయన కోరారు.